NZB: సిరికొండ మండలంపెద్దవాల్గోట్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, వంటగది, పారిశుద్ధ్య నిర్వహణ, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
పెద్దవాల్గోట్ కేజీబీవీలో కలెక్టర్ తనిఖీ


