TPT: తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం అవసరమని, రానున్న కాలంలో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని తలసాని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో తలసాని.. కీలక వ్యాఖ్యలు


