NZB: నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మెకు దిగారు. ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని, మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఔట్సోర్సింగ్ జేఏసీ తెలిపింది.
తెలంగాణ
ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె


