హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్‌స్టాగ్రామ్ స్టంట్స్.. ముగ్గురు అరెస్ట్

HYD: అత్తాపూర్‌లో బైక్ స్టంట్స్ చేస్తూ, వేగంగా వాహనాలు నడిపిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లర్ నంబర్ 257 సమీపంలో డియో స్కూటర్లతో స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్లు లేకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.