NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన ఓర్సు వెంకటేశం, మైల మలేగం కుటుంబాలను, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ


