హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓట్ల తొలగింపుపై బండి సంజయ్ స్పందించాలి: కాంగ్రెస్

KNR: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌ను నిరసిస్తూ కరీంనగర్ మాజీ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని భాజపా ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ఎంపీ బండి సంజయ్ మౌనం వీడి స్పందించాలని విమర్శించారు.