హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణ రాజ్యాధికార పార్టీలో యువత చేరిక

KMR: జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆదరణ పెరుగుతోందని జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ ఈశ్వర్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, బీసీల రాజ్యాధికార లక్ష్యం, సామాజిక న్యాయం కోసం యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న చైతన్యం పార్టీకి మరింత బలాన్నిస్తోందన్నారు.