MNCL: రామకృష్ణాపూర్ కార్మిక వాడల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గురువారం సివిల్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు దబ్బెటి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే పండుగల నేపథ్యంలో మంచినీటి వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేయాలని కోరారు.
తెలంగాణ
కార్మికవాడల్లో తాగునీటి కోసం వినతి


