ADB: మావల మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై దుర్గానగర్ కాలనీ మలుపు వద్ద నాలా గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు అదుపుతప్పితే గుంతలో పడి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందన్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతపై స్లాబ్ నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డు పక్కనే పొంచి ఉన్న పెను ప్రమాదం


