హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెంజల్‌లో రైతుల రాస్తారోకో

NZB: రెంజల్ మండలం కల్యాపూర్‌కు చెందిన పలువురు రైతులు నవీపేట్-కందకుర్తి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడు వడ్డీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అధిక ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులను ఆయన బెదిరించి పంపివేయడం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.