MBNR: మిడ్జిల్ మండలం వేముల శివారులోని వాడ్యాల గేట్ నుంచి మసిగుండ్లపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైంది. పైపులైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై నిరంతరం నీరు నిలవడంతో పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. దీనివల్ల రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
వేముల రహదారిపై నీటి లీకేజీతో ఇబ్బందులు


