WNP: గోపాల్‌పేట మండలం చెన్నూరు గ్రామంలోని రెండవ అతిపెద్ద అనంతగిరి చెరువు పూర్తిగా నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఎంతో కీలకమైన ఈ చెరువు నిండటంతో గ్రామంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు నీటి కొరత తీరుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండు కుండలా మారడంతో ఆ ప్రాంతమంతా జలకళ కనిపిస్తోంది.
తెలంగాణ
అనంతగిరి చెరువు నిండడంతో రైతుల్లో ఆనందం


