హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: పోచారం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా పంటల సాగుకు నీటి విడుదల కొనసాగుతున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 1.820 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను 1.311 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సాగు అవసరాల నిమిత్తం ప్రధాన కాలువ ద్వారా 241 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.