హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థులు ఎంపిక

 సిరికొండ మండలం తుంపల్లి పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 14 వరకు గద్వాలలో ఈ పోటీలు జరగనున్నాయి. విద్యార్థులను ఎంఈఓ పి. రాములు, హెచ్‌ఎం ఏ. మనోహర్, పీఈటీ నగేష్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.