హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్వార్లతో హంగామా.. ముగ్గురు యువకుల అరెస్ట్

WGL: వరంగల్‌ నగరంలో అర్ధరాత్రి తల్వార్లతో బైక్‌పై తిరుగుతూ హంగామా చేసిన ముగ్గురు యువకులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్‌ కట్‌ చేసి సరదాగా తల్వార్లతో వీధుల్లో తిరిగినట్లు యువకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు కోరారు.