హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు రావు.. అభివృద్ధి జరగదు

KMR: దశాబ్దాలుగా ప్రముఖ వాణిజ్య కేంద్రంగా వెలుగొందిన కామారెడ్డి పట్టణం రాజకీయ విభేదాలు, నిధుల కొరత, అధికారుల అలసత్వంతో కళ తప్పుతోంది. పురపాలకవర్గం ఏర్పడి ఏడాది అవుతున్నా అభివృద్ధి మాత్రం అడుగు ముందుకు పడలేదని స్థానికులు వాపోతున్నారు. కనీస వసతులు కరువై మున్సిపాలిటీలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.