హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల్లో నిరుద్యోగ యువత వివరాల సేకరణ

MBNR: జడ్చర్ల మండలంలోని గ్రామాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు పేరు, వ్యక్తిగత, విద్యార్హత వివరాలను తెలంగాణ ఇ-పంచాయత్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారని పేర్కొన్నారు. అర్హులు కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు.