హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పా ముసుగులో ఇలాంటి పనులా..!

HYD: స్పా ముసుగులో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటగిరి గాయత్రీహిల్స్ లోని ఆయుర్వేది ఫ్యామిలీ స్పాలో వ్యభిచారం జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా నిర్వాహకుడు గోపాల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలియజేశారు.