హైదరాబాద్: 28°C
తెలంగాణ

'16 గంటల విద్యుత్ సరఫరా అందించాలి'

NZB: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. శాఖాపూర్, లింగాపూర్‌ శివారులో 185 ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా వేశారు. నిరంతర విద్యుత్ అందిస్తే పంటలు గట్టెక్కే వీలుందని చివరి తడి వరకు 16 గంటల విద్యుత్ సరఫరా అందించాలని రైతులు కోరుతున్నారు.