హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధుల కొరతతో నిలిచిన ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణం

KMR: బిక్కనూరు కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించినా పూర్తిస్థాయిలో నిర్మాణం జరగలేదు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. అధికారులు స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.