KNR: తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఓ బాలికను కరీంనగర్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి!


