హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలపై మాజీ మంత్రి ఆరా

MHBD: చిన్నగూడూరు హాస్టళ్లను సందర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం, బెడ్స్, బాత్రూంలు వంటి కనీస సౌకర్యాలు సరిగా లేవని పేర్కొన్నారు. బాలికలకు నీళ్ల చారు, పొడితో అల్పాహారం అందించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. విద్యార్థుల సౌకర్యాలు, భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండవద్దని సూచించారు.