హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోరుగా ఇసుక అక్రమ రవాణా

BHNG: ఆలేరు వాగు నుంచి మళ్లీ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొద్దికాలంగా అధికారులు నిఘా పెట్టడంతో ఇసుక దందాకు బ్రేక్ పడగా, వారం రోజులుగా మళ్లీ అక్రమ రవాణా పునరుద్ధరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం ఉదయం అనుమతులు లేకుండా ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్‌ను యువకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.