హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీవీఎస్ థియేటర్‌.. ఇక కళాభారతి !

NLG: నల్గొండ తులసీనగర్‌లో ఖాళీగా ఉన్న పీవీఎస్ థియేటర్‌ను ఆధునిక ఆడిటోరియంగా అభివృద్ధి చేయాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించింది. సుమారు వెయ్యి మంది కూర్చునేలా, పార్కింగ్ సౌకర్యంతో సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనువుగా తీర్చిదిద్దనున్నారు. త్వరలోనే ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మేయర్ బుర్రి చైతన్య ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.