హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీపై రైలు ఇంజన్.. వైరల్ దృశ్యాలు

BDK: మణుగూరు పట్టణంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. రైలు ఇంజన్‌ను భారీ లారీపై తరలిస్తుండగా స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. సాధారణంగా రైల్వే మార్గంలో కనిపించే రైలు ఇంజన్‌ రోడ్డుపై లారీపై ప్రయాణిస్తుండటంతో ఈ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. పట్టణంలోని ప్రధాన రహదారిపై రైలు ఇంజన్‌ను తరలిస్తుండగా వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.