హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బైక్‌లోకి పాము.. రానాపూర్‌లో కలకలం'

SRD: మనూరు మండలం రానాపూర్‌లో బైక్‌లోకి పాము చేరడంతో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఏర్పుల సామెల్ బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో బైక్‌ను నిలిపి ఉంచగా పాము అందులోకి వెళ్లింది. దీనిని గుర్తించిన సామెల్ భయంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. వారు బైక్‌ను పరిశీలించి పామును సురక్షితంగా బయటకు తీశారు. దీంతో సామెల్‌తో పాటు గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.