MLG: వెంకటాపురం(M) కేంద్రంలోని సున్నంబట్టి వీధిలో ఏడాది క్రితం నిర్మించిన సీసీ రోడ్డు కుంగిపోయి ధ్వంసమైంది. రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనుల్లో మూడురోడ్ల కూడలి వద్ద సిమెంట్ పైపులు వేయకుండానే రోడ్డు నిర్మించడంతో సమస్య తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. మురుగు, వర్షపునీటితో కింద మట్టి వదులై రోడ్డు కుంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తెలంగాణ
ఏడాదికే ధ్వంసమైన సీసీ రోడ్డు


