హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు నీటితో తీవ్ర ఇబ్బందులు..!

RR: ఇస్నాపూర్ నుంచి పాశమైలారం పారిశ్రామికవాడకు వెళ్లే మార్గంలో రోడ్డుపై నిత్యం మురుగు నీరు పారుతోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతోపాటు దుర్వాసన వెదజల్లుతోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.