హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

PDPL: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో కోటపల్లి మండలం ఎదుళ్లబందంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న దుర్గం మహేష్‌ను అదుపులోకి తీసుకుని, మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.