హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిగ్నల్స్ కనిపించేలా చర్యలు తీసుకోండి'

NRML: ఫ్రొ. జయశంకర్ జంక్షన్‌లో ఫ్లెక్సీలతో ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలోని వాటర్ ఫౌంటెన్ కారణంగా సిగ్నల్ సరిగా కనిపించడం లేదని వారు చెబుతున్నారు. తాజాగా ఫౌంటెన్‌పై షాపింగ్ మాల్‌కు చెందిన భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో సమస్య తీవ్రమైందని వాహనదారులు వాపోతున్నారు. సిగ్నల్స్ స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.