హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై అవగాహన

ప్రకాశం: కంభంలోని అంగన్‌వాడీ సెంటర్-3లో జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం అంగన్‌వాడీ ఉత్సవాలు నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్త ఏ. శారద మాట్లాడుతూ 6 నెలల నుంచి 3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.