KDP: దువ్వూరు జడ్పీ ఉన్నత పాఠశాలను ఇవాళ డీఈవో షంషుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్ద, స్మార్ట్ కిచెన్ నిర్వహణను పరిశీలించారు. భోజన తయారీ, ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో


