హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: జేసీ

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అర్హులు ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, తొలిసారి ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.