ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సమాఖ్య, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'


