హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మెడికల్ సిబ్బంది నిరసన

అనకాపల్లి NTR ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, 100% గ్రాస్ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.