హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

VSP: టౌన్ కొత్త రోడ్డులోని గరుడ జగన్నాయకుల సత్రంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఈ సత్రంలో జరిగిన వేడుకలో కనకమహాలక్ష్మి ఆలయ ఛైర్మన్ కందుల నాగరాజు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.