ADB: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న TWU, SWU, SWF ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని SWF డిపో సెక్రెటరీ ముత్యాల ఆశన్న కార్మికులను కోరారు. బుధవారం సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈనెల 9న జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి భారీ గెలుపునకు సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించండి'


