హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

HNK: పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులు, పాఠశాల పరిసరాలు, వంటగది, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.