హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యులకు గౌరవ వేతనం కోరుతూ వినతి

NLG: అనుముల మండలం కొత్తపల్లి జీపీ కార్యదర్శికి తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం ఆధ్వర్యంలో వార్డు సభ్యులు వినతిపత్రం అందజేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా పనిచేస్తున్న తమకు గౌరవ వేతనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న తమకు గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరారు.