BDK: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయానికి భక్తులు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో పుస్తకాలను భద్రపరిచేందుకు స్థలాభావం ఏర్పడటంతో వైదిక సిబ్బంది సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బుధవారం నిమజ్జనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని ఇఓ తెలిపారు.
తెలంగాణ
శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం


