హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐ పాసైన వారికి ఉద్యోగావకాశం

BDK: జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన యువతకు అప్రెంటీస్ అవకాశాల కోసం ఈ నెల 12న మేళా నిర్వహించనున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా Apprenticeship India వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ఆధార్, బయోడేటా, విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపల్ జి. రమేష్ సూచించారు.