హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాల్ భోరి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: ఎమ్మెల్యే పాయల్

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిట్యాల్ భోరి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని బుధవారం ప్రారంభించి, VO భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రహదారులు, వంతెనల కోసం రూ.20 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.