హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీ.ఈ షా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న శ్రీధర్ బాబు

HYD: హైదరాబాద్‌లో డీ.ఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంస్థ కొత్త కార్యాలయాన్ని ప్రకటించింది. గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి, విస్తరించి, అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తోందన్నారు. డీ.ఈ షా ఇండియా బృందానికి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు.