KNR: కరీంనగర్‌లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం మోదీ చేసిన 25 ఏళ్ల సేవను గుర్తు చేస్తూ సేవా జ్యోతి నిర్వహించామన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని, రాహుల్ గాంధీ దానిపై బురద చల్లడం తగదని అన్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో సేవా జ్యోతిలో పాల్గొన్న కేంద్ర మంత్రి


