ములుగు జిల్లాలో సైబర్ మోసాలపై అవగాహనకు “Fraud Ka Full Stop” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. తక్షణ రుణాల పేరుతో ముందస్తు ఫీజులు వసూలు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. OTP, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
తెలంగాణ
నకిలీ లోన్ ఆఫర్లతో జాగ్రత్త : ఎస్పీ


