హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ

WGL: కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన BRS నాయకుడు భూక్య యాకూబ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.