హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామంచలో పల్లె పల్లెకు పొన్నం అన్న

SDPT: చిగురుమామిడి మండలం రామంచలో మంత్రి పొన్నం ప్రభాకర్ 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సమస్యలను ప్రజలను తెలుసుకుని, అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామంచ-ములకనూరు రహదారికి రూ.3.60 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మూడు చెరువుల మత్తడి నీరు దాటే ప్రాంతాల్లో కల్వర్టులు, రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.