హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా యాదాద్రీశుడి నిత్య కళ్యాణం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మహామండపంలో స్వామి, అమ్మవార్లను కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి వేద మంత్రాల మధ్య సుమారు రెండు గంటల పాటు కళ్యాణ తంతు జరిపారు. భక్తులు పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.