RR: కొందుర్గ్ మండలం బైరంపల్లి, ఉత్తరాసిపల్లి, టేకులపల్లి గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. బోరు మోటార్ల సర్వీస్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎందుతున్న తరుణంలో, ఈ దొంగతనాలతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు దొంగల ముఠా భరతం పట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
వ్యవసాయ మోటార్ల వైర్ల చోరీ


