ASR: జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్ రోడ్డులోని ఆలయ భద్రతపై సీలేరు ఎస్సై ఎండీ యాసీన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. బుధవారం ఆలయంలోని సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. రాత్రివేళ బస చేసే వారి వివరాలు సేకరించాలని, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని, సీసీ ఫుటేజీలను భద్రపరచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ధారాలమ్మ ఘాట్ రోడ్డు ఆలయంపై పోలీసుల నిఘా


